అజ్ఞాతవాసి ఐదు రోజుల వసూళ్లు

Tuesday, January 16th, 2018, 09:24:18 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన అజ్ఞాతవాసి భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. మొదటి రోజు వచ్చిన భారీ కలెక్షన్స్ రెండో రోజు తగ్గిపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఎక్కడ చుసిన డిసాస్టర్ టాక్ వచ్చేసింది. అటు న్యూ ఇయర్ .. ఇటు సంక్రాంతి పండగ సందర్బంగా వచ్చిన అజ్ఞాతవాసి తీవ్ర నిరాశను మిగిల్చాడు. సంక్రాంతి నుండి వెంకటేష్ నటించిన సన్నివేశాలను కలిపినా పెద్దగా వర్కవుట్ కాలేదు .. మరి వసూళ్ల పరంగా అజ్ఞాతవాసి ఎలా వసూలు చేసాడో చూద్దాం .. అజ్ఞాతవాసి 5 రోజుల కలక్షన్స్

షేర్ లలో ..
నైజాం – 9. 25 కోట్లు,
సీడెడ్ – 4. 45 కోట్లు,
కృష్ణా – 2. 58 కోట్లు,
గుంటూరు – 4. 53 కోట్లు,
నెల్లూరు – 1. 98 కోట్లు,
ఈస్ట్ – 3. 23 కోట్లు,
వెస్ట్ – 4. 08 కోట్లు,
వైజాగ్ – 4. 71 కోట్లు,
మొత్తంగా ఆంధ్రా – తెలంగాణ లో కలిసి – 34 . 90 కోట్లు,

అమెరికా – 6. 93 కోట్లు,
కర్ణాటక – 6. 02 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా – 2. 25 కోట్లు,
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి – 50 . 11 కోట్లు.