ఇండియన్ సినిమాల్లో అజ్ఞాతవాసికి 3వ స్థానం !

Wednesday, February 14th, 2018, 10:10:38 PM IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా మొదటి రోజే దారుణమైన టాక్ ను సొంత చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా సినిమా నిర్మాతకు ఏ మాత్రం లాభాలను అందించలేదు. ఇక అసలు విషయానికి వస్తే.. అజ్ఞాతవాసి సినిమా త్రియేటికల్ రైట్స్ 125 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ మొత్తంగా 94.6 కోట్లను దాటింది. అయితే షేర్స్ పరంగా సినిమా 57.5 కోట్లను అందుకుంది. ఈ సినిమా 46% నష్టాలను మాత్రమే రికవర్ చేసింది. దీంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో అజ్ఞాతవాసి మూడవ స్థానంలో నిలిచింది. దానికంటే ముందు బాంబే వెల్వెట్ – స్పైడర్ సినిమాలు దారుణమైన నష్టాలను చూశాయి.

ఏరియాల వారీగా వచ్చిన షేర్స్ ఇలా ఉన్నాయి.

ఆంధ్ర+తెలంగాణ
40.9 కోట్లు
యూఎస్ ఏ 7.20 కోట్లు
కర్ణాటక  6.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్
1.19 కోట్లు
వరల్డ్ వైడ్ గా 57.5 కోట్లు