అదిరింది : అజ్ఞాతవాసి పక్కన మెగా స్టార్!

Tuesday, January 9th, 2018, 06:31:22 PM IST

పండగ ముందు పవన్ అభిమానులకు వస్తోన్న మరో పండగ అజ్ఞాతవాసి రిలీజ్. ఈ సినిమా కోసం వారు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో సినీ ప్రముఖులు కూడా సినిమా ఎలా ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు. ఇక కత్తి మహేష్ వివాదం కూడా ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడం లేదు. పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కొంత మంది యువ హీరోలు కూడా సినిమాను చూడాలని స్పెషల్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అజ్ఞాతవాసి ఫొటోస్ ని షేర్ చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో మాత్రం చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. అజ్ఞాతవాసి పక్కన మెగాస్టార్ ఉన్నాడు. ఆ ఫొటోని చూస్తుంటే కరెక్ట్ గా మెగా హీరోలు కలిసి సినిమాలో ఉన్నట్లుగా ఉందని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు వారి కలయికలో సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం పక్క అని అంటున్నారు.