బయ్యర్లకు కొంత మొత్తం తిరిగి ఇవ్వనున్న అజ్ఞాతవాసి నిర్మాత ?

Saturday, January 20th, 2018, 04:59:44 PM IST

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఇప్పుడు ఇండస్ట్రీ లో ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రం, అందులోనూ పవన్ కు ఇది 25 వ చిత్రం అవడంతో ఈ చిత్ర విజయంపై ప్రతి ఒక్క పవన్ అభిమాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ విడుదల తర్వాత ఆ ఆశలన్నీ నిరాశలయ్యాయి. మొత్తం దక్షిణాదినే అతి పెద్ద డిజాస్టర్ గా ఈ చిత్రం నిలవనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని చోట్ల చిత్రాన్ని కొన్న వారికి యాభై శాతం పైగానే నష్టాలని మిగిల్చే అవకాశం గట్టిగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరొక వైపు చిత్ర నిర్మాత రాధ కృష్ణ కు ఇండస్ట్రీ లో మంచి సౌమ్యుడిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా, నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిగా మంచి పేరుందని, అటువంటి ఆయన బయ్యర్లకు వచ్చిన నష్టం లో తన వంతుగా, ఒక 15 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారట, అలానే త్రివిక్రమ్ కూడా కొంత మొత్తం తిరిగి ఇవ్వడానికి ముందుకొచ్చారని అయితే హీరో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సాయం అందించడానికి ముందుకు వస్తే బాగుంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి…..