షాక్ : అజ్ఞాతవాసి టికెట్ ధర పెరగనుందా?

Sunday, December 3rd, 2017, 12:34:13 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి విడుదల తేదికి ఇంకా చాలా టైమ్ ఉన్నా అప్పుడే హడావుడి మొదలైంది. 2018 జనవరి లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా బిజినెస్ దాదాపు 150 కోట్లు దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక ప్రస్తుత వస్తోన్న హాట్ టాపిక్ ఏమిటంటే సినిమా టికెట్ ధరను పెంచనున్నట్లు టాక్ బాగా వినిపిస్తోంది.

సాధారణంగా ఈ రోజుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అయితే యూనిఫామ్ టికెట్ అని ఆచరణలోకి తెస్తున్నారు. అంటే ఆ సినిమాలకు రెగ్యులర్ టికెట్ రేట్స్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండనుందట. ప్రస్తుతం మల్టిప్లెక్స్ థియేటర్స్ లో 150 నుంచి 250 రూపాయలవరకు టికెట్ రేట్స్ ఉన్నాయి. అయితే అజ్ఞాతవాసి సినిమాకి అన్ని థియేటర్స్ లో టికెట్ ధర రూ.200 కానుందట. అందుకు నిర్మాత బయ్యర్స్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

  •  
  •  
  •  
  •  

Comments