అజ్ఞాతవాసి అసలు కథ ఇదేనట?

Saturday, December 2nd, 2017, 05:22:32 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఏదైనా ఉందా అని అంటే అది ఒక్క అజ్ఞాతవాసి అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే 150 కోట్ల బిజినెస్ చేసిందని చెబుతున్నారు.అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రోజుకొక రూమర్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా కథపై చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే రీసెంట్ గా వస్తోన్న ఒక న్యూస్ ని బట్టి సినిమా కథ ఇదే అని అందరు చర్చించుకుంటున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ ఈ కథను ఒక హాలీవుడ్ సినిమా కథ ఆదారంగా రాసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.‘ది హెయిర్‌ అప్పారెంట్‌’ అనే చిత్రంలోని అసలు పాయింట్ ఈ సినిమాలో ఉంటుందట. ఒక ధనవంతుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే అనుకోకుండా ప్రమాదంలో చనిపోగానే వారి ఆస్తిని దక్కించుకోవాలని కొందరు కుట్ర పన్నుతారు. అయితే మొదటి భార్య కొడుకు ఎక్కడున్నాడనే విషయం ఎవరికీ తెలియదు. అయితే అతని కోసం వెతికే ప్రయత్నంలో అతను అసలు కథలోకి ఎంటర్ అయ్యాక జరిగే పరిణామాలే అసలు కథ అని తెలుస్తోంది. అయితే ఈ కథ మొత్తం త్రివిక్రమ్ స్టైల్ ఉంటుందనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది. మరి మాటల మాంత్రికుడు ఎలాంటి మ్యాజిక్ చూపిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments