మహేష్ 24 పై అజ్ఞాతవాసి ఎఫెక్ట్ ?

Wednesday, January 17th, 2018, 10:19:45 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో డివివి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం ఫస్ట్ లుక్ ఈనెల రిపబ్లిక్ డే కానుకగా 26 న విడుదల కానుంది. ఇది మహేష్ కి 24 వ చిత్రం, అయితే ఈ చిత్రం 100 కోట్ల పైనే బిజినెస్ చేసే అవకాశాలు వున్నాయి. అసలు విషయం లోకి వెళితే, ఇదివరకు మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో వచ్చిన స్పైడర్ కూడా 120 కోట్ల వరకు బిజినెస్ జరిగింది, విడుదల తర్వాత అతి పెద్ద పరాజయాన్ని అందుకున్న ఆ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ఈ సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి కూడా అతి పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుని భారీ నష్టాలు మిగిల్చే దిశగా నడుస్తోంది.

ఈ చిత్ర ఎఫెక్ట్ ఇప్పుడు మహేష్, కొరటాల చిత్రం పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం ఏమేరకు బిజినెస్ చేస్తుందో కొద్దిరోజులు ఐతేగాని తెలియదని, హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ లను నమ్మి, డిస్ట్రిబ్యూటర్ లు బయ్యర్ లు అత్యధిక మొత్తం ఇచ్చి వాటిని కొంటున్నారని, అవి మంచి టాక్ తో నడిస్తే పర్వాలేదు గాని, అదే ఏ మాత్రం నెగటివ్ టాక్ వచ్చినా అతి పెద్ద డిజాస్టర్ లు గా నిలిచి కొన్న వారికి భారీ నష్టాలు చవిచూసేలా చేస్తున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యూటర్ లు బయ్యర్ల పెద్ద చిత్రాలను కొనేందుకు రావడానికి కొంత వరకు ఆలోచించే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అంతే కాక ఇప్పటివరకు టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డు గా 100 కోట్ల మేర షేర్ పొందినది కేవలం మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.