ఆ విషయం లో బాహుబలి రికార్డును అందుకోలేకపోయిన అజ్ఞాతవాసి!

Wednesday, January 10th, 2018, 11:26:16 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ ల లో విడుదలయిన అజ్ఞాతవాసి చిత్రం మంచి టాక్ సంపాదించింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 2700 థియేటర్ ల లో విడుదలయిన ఈ చిత్రం దాదాపుగా చాలా చోట్ల అద్భుత ఓపెనింగ్స్ సంపాదించింది. అయితే ఓవర్సీస్ లో బాహుబలి-2 కన్నా అత్యధిక థియేటర్ లలో విడుదలయిన ఈ చిత్రం మాత్రం ఒక్క విషయం లో బాహుబలి-2 రికార్డు ని అక్కడ అందుకో లేకపోయింది. రిలీజ్ పరంగా అక్కడ ఎక్కువ థియేటర్ లలో విడుదలైనప్పటికీ తొలి ప్రీమియర్ షోల కలెక్షన్ విషయం లో ఆ చిత్రాన్ని అందుకోలేకపోయింది. నిన్న రాత్రి వేసిన తొలి షో ల ద్వారా 14,64,647 డాలర్స్ వసూలయ్యాయని, ఇది రెండవ ఆల్ టైం రికార్డు కలెక్షన్ అని పి ఆర్ ఓ వంశి శేఖర్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా మూడు మరి నాలుగవ స్థానాల్లో వరుసగా బాహుబలి, ఖైదీ నెంబర్ 150 చిత్రాలు నిలిచాయి…