అజ్ఞాతవాసి అభిమానుల గొడవ..పోలీస్ ఎంట్రీ..!

Wednesday, January 10th, 2018, 09:39:19 AM IST

నెల్లూరులో అజ్ఞాతవాసి టికెట్ల వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొందరు అభిమాన సంఘాల పేరుతో టికెట్లని బ్లాక్ లో విక్రయిస్తుండడంతో వివాదం మొదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి యువత నాయకులు పెద్ద ఎత్తున డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. చిరు, పవన్ అభిమానుల పేరుతో కొందరు బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తూ అభిమానులని నిరాశకు గురిచేస్తున్నారని ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.

దీనితో ఎస్పీ థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా సాగ భాగం టికెట్లు అభిమానులకు కేటాయించాలని, మిగిలినవి క్యూ లైన్ లో, ఆన్ లైన్ లో విక్రయించాలని ఆదేశించడంతో థియేటర్ యాజమాన్యం అంగీకరించింది. దీనితో వివాదం సద్దుమణిగింది.