ఎంఏఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా.. ఇది కేసీఆర్ గేమ్ ప్లాన్ !

Friday, June 7th, 2019, 08:00:31 PM IST

కాంగ్రెస్ శాసనసభాపక్షం తెరాసలో విలీనం కావడంతో శాసనసభలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ నుండి 12మంది ఎమ్మెల్యేలు తెరాస గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 6కు పడిపోయింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆ పార్టీ కోల్పోయింది. ఫలితంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎఐఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా మారింది.

సాధారణంగా 120మంది ఉన్న శాసనసభలో కనీసం 10 శాతం మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఉంటుంది. కానీ కాంగ్రెస్ వద్ద 6గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో విధిలేక 7గురు ఎమ్మెల్యేలు ఉన్న ఎఐఎంఐఎంను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సిన పరిస్తితి తలెత్తింది. ఇక మజ్లిస్ ఎలాగూ తెరాసకు మిత్రపక్షమే కాబట్టి శాసనసభలో ఆ కెసిఆర్ అండ్ కో ప్రశ్నించేవారు లేకుండానే పాలన సాగించే సౌలభ్యాన్ని దక్కించుకుంది. అసలు ఒవైసీని ప్రధాన ప్రతిపక్ష నేతగా చేయాలనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమలో కలుపుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.