ఎయిర్ టెల్ భామ టాలీవుడ్ ఎంట్రీ!!

Sunday, March 4th, 2018, 06:43:31 PM IST

ఇటీవల కాలంలో ఎయిర్ టెల్ 4జీ ప్రకటనతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ఉత్తరాది అమ్మాయి షాషా చెత్రి త్వరలోనే సినిమాల్లోకి కూడా అడుగుపెట్టేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మాయికి అనూహ్యంగా తెలుగులో కథానాయికగా నటించే అవకాశం దక్కడం విశేషం. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత లాంటి సినిమాలు తీసిన సాయికిరణ్ అడివి దర్శకత్వంలో షాషా నటించనుంది. కొన్నాళ్లుగా ఈ చిత్రం కోసం కథానాయకుడి వేట సాగించాడు సాయికిరణ్. ఎట్టకేలకు అతడి ప్రయత్నం ఫలించింది సాయికుమార్ తనయుడు ఆది రూపంలో హీరో దొరికాడు. ఆది, షాషా వీరిద్దరూ జోడి కడుతున్నారు.

ప్రస్తుతానికి వరుస ఫ్లాపులతో సతమతమవుతుతున్న ఆది ఈ చిత్రం తో మంచి బ్రేక్ కొట్టాలనుకుంటున్నాడు. నిజానికి సాయికిరణ్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. తొలి సినిమా వినాయకుడు తర్వాత అతనికి కూడా మంచి విజమేది దక్కలేదు. దిల్ రాజు నిర్మాణంలో అతను చేసిన కేరింత కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. సాయికిరణ్, ఆది, షాషా ఈ ముగ్గురికీ ఈ చిత్రం కీలకమనే చెప్పాలి. కాగా ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలు ప్రకటించవలసి వింది…