పండోరాని కేన్స్‌లో దించారు!

Sunday, May 13th, 2018, 05:59:50 PM IST

కేన్స్ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్నాయి. అంబ‌రాన్ని తాకే ఈ పండుగ‌లో హంస‌రాణుల మెర‌పులు మైమ‌రిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాణీ ప‌ద్మావ‌తి, క్వీన్ కంగ‌న మెరుపులే మెరుపులు. దీపిక‌, కంగ‌న గ్లింప్స్‌ని అభిమానులు క్యాచ్ చేశారు. ఇప్పుడు అంత‌కుమించి.. అక్క‌డ ఐశ్వ‌ర్యారాయ్ మెరుపులు మెరిపించింది. ఈ మాజీ విశ్వ‌సుంద‌రి ఏకంగా ఆరాధ్య‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేసి మ‌తులు చెడ‌గొట్టింది.

ఈ వేడుక‌లో ఐశ్వ‌ర్యారాయ్ ధ‌రించిన డ్రెస్ ఓవ‌రాల్ ఈవెంట్‌కే హైలైట్. అచ్చం అవ‌తార్ పండోరా గ్ర‌హంపై గ‌రుడ‌ప‌క్షి ఇక్రాన్‌ని మ‌రిపించింది. పండోరా ప‌క్షి డిజైన్‌ని పోలి ఉన్న డ్రెస్‌లో త‌ళ‌త‌ళ మెరిసిపోయింది. ఈ డిజైన్‌ని దుబాక్‌కి చెందిన మైఖేల్ సిన్సినో అనే ప్ర‌ఖ్యాత‌ డిజైన‌ర్ రూపొందించారు. వ‌రుస‌గా 17వ వ‌సంతాలుగా ఐష్ కేన్స్ ఉత్స‌వాల్లో పాల్గొంటూనే ఉంది. ఈసారి 40 ప్ల‌స్ ఐష్ టీనేజీ నాయిక‌నే త‌ల‌పించింది. త‌న‌తో పాటే ఆరాధ్య రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో త‌ళుకుబెళుకులు ఆవిష్క‌రించింది. ప‌ది సెక‌న్ల వీడియోలో ఐష్‌- ఆరాధ్య మెరుపులు న‌భూతోన‌భ‌విష్య‌తి.

Circle of Life 💖😍✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

  •  
  •  
  •  
  •  

Comments