రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లైప్ లో రొమాన్స్ కు రెడీ అయ్యారు ?

Tuesday, February 28th, 2017, 10:26:02 PM IST


బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్య రాయ్ ఈ మద్యే సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఆమె మళ్ళీ తన భర్త తో కలిసి రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది ? ఇప్పటికే ఐష్ – అభిషేక్ కలిసి ”ధూమ్ 2”, ”గురు”, ”రావణ్” చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి తెరపై రొమాన్స్ కు రెడీ అయ్యారు. లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి ”గులాబ్ జాబూన్” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ అని తెలిసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తీ కావొచ్చాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వల్లే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇక రియల్ లైఫ్ లో భార్య భర్తలైన ఈ జంట ఇప్పుడు తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యారని, మరి వీరిద్దరూ కలిసి నటించే ఈ సినిమా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి !!