ఎర్ర అతివాచీపై అందాల సీతాకోక చిలుక ఐశు..

Monday, May 14th, 2018, 10:55:16 AM IST

ఎన్ని ఏళ్ళు గడిచినా తరగని అందం, ముడత పడని చర్మ సౌందర్యం, నటనలో, నిజ జీవితంలో ఒక తల్లిగా ఒక కోడలిగా హోప్ప మహిళా నిలిచిన ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్‌కు కేన్స్ చిత్రోత్సవంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. రెడ్ కార్పెట్ పై ఈ అందాల భామ, భారత నారి రాక కోసం అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తిని ప్రదర్శిస్తుంది. ఇటివల జరిగిన 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ సందడి చేసి అటు అభిమానులను, ఇటు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. సీతాకోకచిలుక మాదిరిలో ఉన్న డిజైన్‌లో తీర్చిదిద్దిన గౌను ధరించి వీక్షకుల మనసుల్ని యిట్టె దోచుకుంది వినూత్న నటి ఐశ్వర్య రాయ్. వినూత్న శైలిలో దుబాయ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్ మైకేల్‌సింకో రూపకల్పన చేసిన ఈ సీతాకోకచిలుక వస్త్రధారణలో ఎర్ర తివాచీపై ఐశ్వర్యరాయ్ అతిలోక సుందరిలా నడయాడింది.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని ఐశ్వర్యరాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులకు మరింత మతి పోగొట్టేలా చేస్తుంది. నలభయ్యేల్ల వయస్సు వచ్చినా కూడా వన్నెతరగని సౌందర్యం అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసల కెరటాల్లో ముంచెత్తుతున్నారు. అభిమానుల మనస్సును దోచిన అందాల సీతాకోకచిలుక అంటూ ఆమె ధరించిన గౌనుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఈ నెల 8న ప్రారంభమైన కేన్స్ చిత్రోత్సవాలు ఈ నెల 19వరకు కొనసాగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ చిత్రాల్ని ఈ వేడుకలో ప్రదర్శించడానికి సర్వత్రా సిద్దం చేశారు. భారత్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నందితాదాస్ దర్శకత్వం వహించిన మంటో, ధనుష్ నటించిన ది ఎక్స్‌ట్రార్డీనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ చిత్రాల్ని కూడా ప్రదర్శించబోతున్నారు. మునుముందు మన హారతదేశం నుండి ఇంకెంత మంది ఈ షోకు వచ్చి మనల్నిఅలరిస్తారన్నది వేచి చూడాల్సిందే.