షాకింగ్ : విశ్వ‌సుంద‌రి సూసైడ్ ఎటెంప్ట్‌?

Wednesday, December 28th, 2016, 06:04:13 PM IST

aishwarya
మాజీ విశ్వ‌సుంద‌రి, బాలీవుడ్ అగ్ర‌క‌థానాయిక‌, బ‌చ్చ‌న్ల కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ సూసైడ్ ఎటెంప్ట్ చేశారా? అంటే అవున‌నే బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్య‌మాల్లో ఇదో హాట్ టాపిక్‌. ఈ విష‌యంపై ఓ నెటిజ‌నుడు నేరుగా అమితాబ్ నే ప్ర‌శ్నించ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ర‌ణ‌బీర్‌తో సినిమా చేసిన‌ప్ప‌టినుంచి ఐష్ ఫేట్ మారిపోయింది. బ‌చ్చ‌న్‌ల ఫ్యామిలీలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ్‌.
ర‌ణ‌బీర్‌తో `ఏ దిల్ హై ముష్కిల్` చిత్రంలో ఘాటైన అద‌ర‌చుంబ‌నం లాగించేస్తూ.. ఐసూ ప్ర‌ద‌ర్శించిన తెగువ బ‌చ్చ‌న్ ఫ్యామిలీకి న‌చ్చ‌లేదు. ర‌ణ‌బీర్‌తో హాట్ ఫోటోషూట్ వెలికి రావ‌డం న‌చ్చ‌లేదు.. అందుకే ఐష్ గొడ‌వ ప‌డింది. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. కుటుంబ స‌భ్యులు సీక్రెట్‌గా డాక్ట‌రుని పిలిచి ట్రీట్‌మెంట్ ఇప్పించడంతో బ‌తికి బ‌య‌ట‌పింది.. అంటూ నెటిజ‌నులు ముచ్చ‌ట‌పెడుతున్నారు. ఐష్ సూసైడ్‌పై గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ న‌డుస్తోంది.

అంద‌రు అమ్మాయిల్లాగే ఐశ్వ‌ర్యారాయ్‌కి అత్తింటి ఆర‌ళ్లు ఉన్నాయంటూ ఇదివ‌ర‌కే మీడియా ప్ర‌చారం చేసింది. ధూమ్‌2లో హృతిక్‌తో లిప్‌లాక్ వేసిన‌ప్పుడు ఐష్ గురించి ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి. స‌ల్మాన్ తో ప్రేమాయ‌ణంలోనూ సూసైడ్ వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు మ‌రోసారి ఈ వార్త‌లు పెనుకంప‌నంలా దూసుకొచ్చాయి.

  •  
  •  
  •  
  •  

Comments