విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌ కిడ్నాప్‌?

Friday, July 27th, 2018, 07:41:23 PM IST

మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కిడ్నాప్‌కు గుర‌య్యారా? అదెలా సాధ్యం.. ? బ‌చ్చ‌న్‌ల కోడ‌లు అంత తేలిగ్గా కిడ్నాప్‌కు గుర‌వుతుందా? అంటే కాస్త లోతుగా వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఐశ్వ‌ర్యారాయ్ కిడ్నాప్ వ్య‌వ‌హారం నిజ‌మే. అయితే అది కేవ‌లం వెండితెర కోసం మాత్ర‌మే. కిడ్నాప‌ర్లు ఎవ‌రో తెలుసా? సీనియ‌ర్ హీరో అనీల్ క‌పూర్‌, కుర్ర‌హీరో రాజ్‌కుమార్ రావ్‌. ఇంత‌కీ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అంటే సినిమా స్క్రిప్టులో భాగంగానే కిడ్నాప్ చేస్తారు. అయితే కిడ్నాప్ త‌ర్వాత ప‌రిణామాలేంటి? అన్న‌దే సినిమా. ఇంత‌కీ టైటిల్ ఏంటి? అంటే ఫ్యానీ ఖాన్‌. ఈ సినిమా తాజా టీజ‌ర్ వీక్షించ‌గానే ఈ సినిమాలో ఫ‌న్ ఎంతో, టెన్ష‌న్ ఎంతో తెలిసిపోతోంది. ముఖ్యంగా ఇందులో సంభాష‌ణ‌లు మైండ్ బ్లోవింగ్ అంటూ రెస్సాన్స్ వ‌స్తోంది. ఇదిగో తాజా టీజ‌ర్ చూస్తే మీరే ఆ మాట చెప్పేస్తారు. 2018 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఈ సినిమా ఒక‌టి.

  •  
  •  
  •  
  •  

Comments