`భార‌తీయుడు- 2`లో దేవ‌గ‌ణ్‌?

Saturday, May 5th, 2018, 09:53:25 PM IST


ఇన్నాళ్లు `2.ఓ` ప‌నులు ఎటూ తేల‌క మ‌ల్ల గుల్లాలు ప‌డుతున్నాడు శంక‌ర్‌. అస‌లు ఆ ప్రాజెక్టును ఎప్ప‌టికి రిలీజ్ చేయాలి? అన్న‌దానిపై అత‌డికి ఎలాంటి క్లారిటీ లేనేలేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఎటూ తేలక‌పోవ‌డం, వీఎఫ్ఎక్స్ రీవ‌ర్క్ చేయ‌డం అన్న‌ది అత‌డికి ఇప్ప‌టికీ అంతు చిక్క‌ని ఫజిల్‌లా ఉంది. అయినా ఎట్టి ప‌రిస్థితిలో అన్ని ప‌నులు ఆగ‌ష్టు నాటికి పూర్తి చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా.. భార‌తీయుడు 2 ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభించి ఇక త‌దుప‌రి ప్రాజెక్టుపై దృష్టి సారించాల‌ని అనుకుంటున్నారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం .. ఈ చిత్రంలో ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ న‌టిస్తార‌ని తెలుస్తోంది. శంక‌ర్ ఆ మేర‌కు సంప్ర‌దింపులు చేస్తున్నార‌ట‌. ఫ‌లానా హీరో అని చెప్ప‌డం లేదు కానీ, ఈ చిత్రంలో ఓ పెద్ద స్టార్ హీరో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తార‌న్న స‌మాచారం అందింది. అక్ష‌య్ ఇప్ప‌టికే 2.ఓ లో న‌టించారు కాబ‌ట్టి అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్‌, హిందీ త్రిభాషా చిత్రంగా తెర‌కెక్కించి, అన్ని దేశాల్లోనూ రిలీజ్ చేసే ప్లాన్ ఉందిట‌. హిందీ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రంలో బ‌హుభాషా న‌టుల్ని ఎంపిక చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక బ‌డ్జెట్ ప‌రంగానూ భారీ స్కేల్‌లో ఉంటుంద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్ పోర్ట‌ల్ పేర్కొంది.

  •  
  •  
  •  
  •  

Comments