అందుకోసం హీరోయిన్స్ ని వాడుకోలేదు

Saturday, October 14th, 2017, 03:54:43 PM IST

బాలీవుడ్ లో గోల్ మాల్ పేరుతో ఇప్పటివరకు వచ్చిన మూడు వెర్షన్స్ చాలా హిట్ అయ్యాయి. అయితే మళ్లీ ఇప్పుడు అదే తరహాలో హిట్ కొట్టాలని అజయ్ దేవగన్ నాలుగవసారి గోల్ మాల్ ఎగైన్ తో వస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొంది. ‘

అయితే అజయ్ దేవగన్ సినిమా గురించి మాట్లాడిన తర్వాత హీరోయిన్స్ ని ఎక్కువగా వల్గర్ కామెడీ కోసమే వాడుకుంటున్నట్లు వస్తున్న కామెంట్స్ పై తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చాడు. తాను హీరోయిన్స్ విషయం లో ఎప్పుడు ఆలా ఆలోచించలేదని చెబుతూ.. గోల్ మాల్ ఎగైన్ సినిమాలో హీరోయిన్స్ పై అలాంటి కామెంట్స్ ఉండవని చెప్పాడు. అంతే కాకుండా తన సినిమాల్లో అలాంటివి ఉండకుండా చూసుకుంటానని ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాలను కలిసి చూడాలని అనుకుంటానని చెప్పారు. ఈ సినిమాలో పరిణితి చోప్రా – టబు ల పాత్రలు చాలా బావుంటాయని ఎటువంటి వల్గారిటీ లేదని అజయ్ వివరించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీతో పాటు ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments