అబ్బో…అజాయ్ లిప్ లాక్ తో అదరగొట్టాడుగా !!

Wednesday, September 21st, 2016, 12:43:37 PM IST

ajay
ఈ మధ్య బాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాలు లేని సినిమాలు దాదాపుగా అరుదనే చెప్పాలి !! సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఈ ముద్దులు అయితే కామన్ గా మారాయి !! ఇక ఈ విషయంలో ఇమ్రాన్ హస్మి అయితే ముద్దుల వీరుడు గా సంచలనం రేపాడు. లేటెస్ట్ గా ఇప్పటి వరకు లిప్ లాక్ సీన్స్ కు దూరంగా ఉన్నాడనే ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ దేవగన్ కూడా లిప్ లాక్ ఇచ్చి సంచలనం రేపాడు ? గత 25 ఏళ్ల కెరీర్ లో అజయ్ దేవగన్ ఇంతవరకు ఏ సినిమాలో లిప్ లాక్ ఇవ్వలేదు!! కానీ తాజాగా అయన నటిస్తున్న”శివాయ్” సినిమాలో హీరోయిన్ ఎరికా కార్ తో మనోడు ఘాటు ముద్దును పంచుకున్నాడు. “శివాయ్” సినిమా పూర్తీ కావొచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ”దరఖాస్త్ … ” అంటూ సాగే పాటలో అజయ్ ఆ హీరోయిన్ తో ఘాటు లిప్ లాక్ ఇచ్చి సంచలనం రేపాడు. ఇప్పుడు ఈ కిస్ సీన్ బాలీవుడ్ లో సంచలనం గా మారింది ?