కాజోల్ (X) దేవ‌గ‌న్‌ : సింగ‌పూర్‌లో 19వ వెడ్డింగ్ యానివ‌ర్శ‌రీ..

Friday, February 23rd, 2018, 10:46:44 PM IST

అందాల క‌థానాయిక కాజోల్ బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్‌ని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రికీ ఇద్ద‌రు సంతానం. పిల్ల‌లు పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతున్నారు. భ‌ర్త కు అన్నీ తానే అయ్యి కాజోల్ వెన్నంటి నిలుస్తోంది. దేవ‌గ‌న్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని విజ‌య‌వంతంగా ర‌న్ చేయ‌డంలో భార్య‌గా త‌న‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తోంది కాజోల్‌. బాలీవుడ్‌లోనే అన్యోన్య‌మైన జంట‌గా పేరు తెచ్చుకున్నారు.

లేటెస్టుగా ఈ జోడీ ఈనెల 24తో 18 వ‌సంతాలు పూర్తి చేసుకుని 19వ వార్షికోత్స‌వం జ‌రుపుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా సింగ‌పూర్‌లో సెల‌బ్రేష‌న్స్‌కి ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే పెద్ద‌మ్మాయ్ నైసా సింగ‌పూర్‌లో చ‌దువుకుంటోంది. త‌న‌తో క‌లిసి ఈ పండుగ‌ను జ‌రుపుకునేందుకు కుమారుడు యుగ్‌తో క‌లిసి దేవ‌గ‌న్‌, కాజోల్ సింగ‌పూర్ ప‌య‌న‌మ‌య్యారు. మొత్తానికి ఈసారి వేడుక సంథింగ్ స్పెష‌ల్‌. వ‌చ్చే ఏడాది 20వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటారు. అంటే రెండు ద‌శాబ్ధాల అన్యోన్య దాంప‌త్యం అనే చెప్పాలి.