ఆర్ఆర్ఆర్ నుండి మోషన్ పోస్టర్ విడుదల…అజయ్ దేవగణ్ బర్త్ డే స్పెషల్!

Friday, April 2nd, 2021, 01:26:03 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం కోసం అభిమానులు అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం సౌత్ ఇండియా లో మాత్రమే కాకుండా, నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు అజయ్ దేవగణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసిన కొద్ది సేపటికే వైరల్ గా మారింది. అయితే పోస్టర్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం రౌద్రం రణం రుధిరం. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. శ్రియ శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర సంగ్రామ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13 వ తేదీన విడుదల కి సిద్దం కానుంది.