హైదరాబాద్లో అజిత్ నయనతారల చిందులు

Thursday, April 19th, 2018, 12:52:19 PM IST

త‌ల అజిత్ మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వాసం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ‘వి’ అక్షరంతో తెర‌కెక్కిన‌ అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇవ్వ‌డంతో త‌న తాజా చిత్రానికి కూడా మొద‌ట లెట‌ర్ వి ఉండేలా చూసుకున్నాడు అజిత్‌. విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ తాజా చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, వీరం, వేదాళం, వివేగం సినిమాల‌ ద‌ర్శ‌కుడు శివ‌నే విశ్వాసం సినిమాని కూడా తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా క‌నిపించ‌నుండ‌గా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై త‌మిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెబుతాడ‌ని స‌మాచారం. విశ్వాసం సినిమా అభిమానుల అంచ‌నాలు మించేలా , చ‌రిత్రలు తిర‌గరాసేలా తెర‌కెక్క‌నుంద‌ని కోలీవుడ్ టాక్ .

విశ్వాసం చిత్రంలో అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. గ‌తంలో అజిత్‌తో క‌లిసి తొలిసారిగా ఏగ‌న్ అనే చిత్రం చేసింది న‌య‌న‌తార . ఆ త‌ర్వాత‌ బిల్లా, ఆరంభం అనే చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు విశ్వాసం చిత్రంతో నాలుగో సారి జ‌త‌క‌డుతున్నారు. అయితే ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ఏర్పాటు చేయ‌గా, ఇందులో అజిత్‌, న‌య‌న్‌ల‌పై ప్రేమ స‌న్నివేశాల‌తో పాటు రొమాంటిక్ గీతాల‌ని కూడా తెర‌కెక్కించ‌నున్నారు. కోలీవుడ్‌లో బంద్ కార‌ణంగా డిలే అయిన మూవీ చిత్రీక‌ర‌ణ త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి డి. ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments