త‌ళా అజిత్ .. మ‌ళ్లీ వివేగం శివ‌తోనే?

Friday, October 13th, 2017, 09:33:23 AM IST

త‌ళా అజిత్ న‌టించే త‌దుప‌రి సినిమా ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది? ప‌్ర‌స్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇది. అజిత్ ఇప్ప‌టికే 57 సినిమాల్లో న‌టించారు. త‌దుప‌రి 58వ సినిమా కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. అయితే ఈసారి ఎలాంటి క‌థాంశంలో న‌టించ‌బోతున్నాడు? దర్శ‌కుడెవ‌రు? అంటూ త‌ళా అభిమానులు ఆరా తీస్తున్నారు. రీసెంటుగా అజిత్ న‌టించిన వివేగం ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 130 కోట్ల మేర వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. అజిత్ 58 చిత్రానికి `వివేగం`, `వేదాళం` చిత్రాల ద‌ర్శ‌కుడు ద‌రువు శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు వేదాళం నిర్మాత క్లూ ఇచ్చారు. శ్రీ సాయిరామ్ క్రియేష‌న్స్ అధినేత్రి ఐశ్వ‌ర్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ -“త‌ళా 58 చిత్రానికి శివ స‌ర్ క‌న్‌ఫామ్ అయ్యారు. అయితే ఈ సినిమా మా బ్యాన‌ర్‌లోనే ఉంటుందా లేదా అన్న‌ది ఇంకా చెప్ప‌లేం“ అని తెలిపారు. ఇప్ప‌టికే అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ వైపు ఈ కాంబో దూసుకుపోతుండ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments