హారర్ సినిమాకోసం రెడీ అవుతున్న అజిత్ ?

Sunday, March 4th, 2018, 03:39:40 PM IST

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజని కాంత్ తరువాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో అజిత్. తలా అజిత్ గా ఫాన్స్ కొలుచుకునే అజిత్ మొదటి సారి ఓ హారర్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు? ప్రస్తుతం అయన దర్శకుడు శివతో ఈ సినిమా చేస్తున్నాడు. శివ – అజిత్ ల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన వీరం , వేదలమ్, వివేకం సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త ప్రయోగం చేయాలనీ ఇలా హర్రర్ నేపథ్యంలో కథను ఎంచుకున్నారట. అన్నట్టు ఈ సినిమాను విశ్వాసం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. మరి హారర్ సినిమాతో అజిత్ ఎలా బయపెడతాడో చూడాలి.