అజిత్ ఓటు రజినికా? కామల్ కా?

Wednesday, January 10th, 2018, 05:54:21 PM IST

తాజా రాజాకీయాలు, రాజకీయ పరిస్థితుల పై ఇప్పటివరకు నోరు విప్పని తమిళ్ సూపర్ స్టార్ అజిత్ ఇక పై తన మద్దతు ఎవరికి ఇస్తారు అనే దాని పై తమిళనాట తీవ్ర చర్చ జరుగుతోంది. మీడియా ఎప్పుడు ఆయనను ప్రశ్నించినా తాను రాజకీయాలకి దూరమని, తనకి రాజకీయాలంటే ఆసక్తి లేదని, తనని తన కెరీర్ ని రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఆయన చెప్పిన సంఘటనలు చాలానే వున్నాయి. అయితే ఇప్పుడు తమిళనాడు లో వున్న రాజకీయ పరిస్థితులని, జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే ఇకపై ఆయన ఆ మాటలు చెప్పి తప్పించుకునే వీలు ఉండబోదని అక్కడి మీడియా వాదన. ఇదే విషయమై మీ మద్దతు ఎవరికి అని మీడియా ఇళయదళపతి విజయ్ ని అడగగా తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన అన్నారు.

అక్కడి ప్రముఖ నటులు అయినా రజినికాంత్ మరియు కమల్ హాసన్ లు విడిగా పార్టీ లు పెట్టడానికి సన్నద్ధమవుతున్నందున అజిత్ ఎవరికి మద్దతు ఇస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే మీనా, సంతానం, విశాల్, లారెన్స్ వంటి తారలు తమ మద్దతు రజినికే ననీ, ఇక నమిత, అమలాపాల్, ఓవియా వంటి నటీమణులు రజిని ఒప్పుకుంటే ఆయన పార్టీ తరపున ప్రచారం కూడా చేస్తామని బహిరంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే రజిని, కమల్ వంటి సూపర్ స్టార్ ల తర్వాత పెద్ద స్టార్ గా తమిళనాడు లో తర్వాతి స్థానం లో వున్న అజిత్ ఈ విషయమై తన వైఖరి ఏమిటో, ఎవరికి మద్దతిస్తారో వేచి చూడాలి…….