బ‌్యాంకాక్‌లో అఖిల్-3 స్టోరి ఫైన‌ల్‌?

Saturday, March 17th, 2018, 12:33:07 PM IST

అక్కినేని అఖిల్ న‌టించే మూడో సినిమా ఏది? ద‌ర్శ‌కుడెవ‌రు? ప‌్ర‌స్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ ఇది. మొద‌టి సినిమా `అఖిల్‌` ఫెయిల్‌. రెండో సినిమా `హ‌లో` పేరొచ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. టాలీవుడ్‌లో తిరుగేలేని పెర్ఫామ‌ర్‌గా అఖిల్‌కి పేరొచ్చింది. స‌డ‌ల‌ని ఆత్మ‌విశ్వాసంతో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా, రెట్టించిన ఉత్సాహంలో అఖిల్ ప్ర‌స్తుతం మూడో సినిమా కోసం భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఈసారి ఓ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడికే అవ‌కాశం అన్న మాటా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై తాజా అప్‌డేట్ ఏంటి?

అఖిల్ న‌టించే మూడో సినిమా హాట్ అప్‌డేట్ లేటెస్టుగా లీకైంది. ఈసారి తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరితో సినిమా దాదాపు ఖాయ‌మైన‌ట్టేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అఖిల్ – వెంకీ బ్యాంకాక్‌లో మంత‌నాలు సాగిస్తున్నారు. స్క్రిప్టును సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఫైన‌ల్ చేసేస్తార‌ట‌. మార్చి 18న ఉగాది కానుక‌గా ద‌ర్శ‌కుడెవ‌రో ప్ర‌క‌టిస్తారని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైన సంగ‌తి విదిత‌మే. ఇక ఈ సినిమాని మెజారిటీ పార్ట్ బ్యాంకాక్‌లో తెర‌కెక్కిస్తారు. 60శాతం చిత్రీక‌ర‌ణ థాయ్‌ల్యాండ్‌లో సాగుతుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్‌కి శుభ‌వార్త అందిన‌ట్టే.