అఖిల్3కి 30శాతం ఇన్సెంటివ్స్‌

Sunday, May 20th, 2018, 02:56:36 AM IST

అక్కినేని అఖిల్ హీరోగా న‌టించే మూడో సినిమా ఈనెల 29 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌- బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మెజారిటీ పార్ట్ లండన్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. అయితే అఖిల్ సినిమాని ఇలా ప్లాన్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే .. లండ‌న్‌, బ్రిట‌న్ లొకేష‌న్ల‌లో తెర‌కెక్కే ఏ సినిమాకి అయినా ఆ ప్ర‌భుత్వం భారీగా ఇన్సెంటివ్స్ ఇవ్వ‌నుంది. ఇన్సెంటివ్ అంటే ప‌న్ను మిన‌హాయింపు అని అర్థం. ఇదివ‌ర‌కూ 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తెర‌కెక్కించిన 1-నేనొక్క‌డినే చిత్రానికి దాదాపు 25-30 శాతం మేర ప‌న్ను మిన‌హాయింపు ద‌క్కింది. ఇటీవ‌లే బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన తొలి ప్రేమ‌, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాల‌కు భారీగా లండ‌న్ ప్ర‌భుత్వం ఇన్సెంటివ్స్ ఇచ్చింది.

కేవ‌లం ఇటు ఇండియ‌న్ సినిమాలు, తెలుగు సినిమాల‌కే కాదు, అటువైపు హాలీవుడ్ సినిమాల‌కు బ్రిటీష్ ప్ర‌భుత్వం భారీగా ప‌న్ను మిన‌హాయింపు ఇస్తోంది. విదేశీ సినిమాల‌తో త‌మ దేశ టూరిజం అభివృద్ధి చెందుతుంద‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. ఆ క్ర‌మంలోనే ఈ ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తోంది. దీనిని బ‌ట్టి మెజారిటీ పార్ట్ తెలుగు సినిమా క‌థ‌లు లండ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రాసుకుంటేనే బెస్ట్ అన్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments