పెళ్లి గురించి అఖిల్ రెస్పాన్స్..!

Tuesday, December 5th, 2017, 10:18:30 PM IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ హలో అని ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 22 న హలో చిత్రం విడుదల కాబోతోంది. తొలిచిత్రం పరాజయం నుంచి తేరుకున్న అఖిల్ ప్రతిభ గల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన హలో చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. కాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ హెల్ చిత్రం గురించి, తన మ్యారేజ్ గురించి ప్రస్తావించాడు.

తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అఖిల్ తెలిపాడు. కెరీర్ ని చక్కదిద్దుకుని సరైన ట్రాక్ లో వెళ్లడం పై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు అఖిల్ చెప్పుకొచ్చాడు. అమ్మ నాన్నలు గర్వపడేలా చేయడమే తన మొదటి లక్ష్యం అని అఖిల్ అన్నాడు. తన ఫస్ట్ మూవీ విషయంలో తేనేమి బాధపడడం లేదని, అఖిల్ చిత్రం ద్వారా తాను చాలా విషాలు తెలుసుకునానన్ని అఖిల్ తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments