నితిన్ పెళ్ళి కోసం రంగంలోకి .. అక్కినేని హీరో ?

Tuesday, November 8th, 2016, 11:19:00 PM IST

akhil-nithin
‘జయం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ‘దిల్’ సినిమాతో హీరోగా నిలబడ్డ నితిన్ .. పలు చిత్రాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో అయన చేసిన ‘అ..ఆ’ సినిమా సంచలన విజయం సాధించడంతో .. నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత అయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు, ఇక సినిమా లైఫ్ పక్కన పెడితే .. ఇప్పటి వరకు బ్యాచిలర్ గా ఉన్న నితిన్ కు వచ్చే ఏడాది పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఇంట్లో వాళ్ళు !! దాంతో ఇప్పటి నుండే ఆయనకు అమ్మాయిని వెదికే పనిలో పడ్డారు !! ఈ విషయంలో సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు అక్కినేని హీరో అఖిల్ ? అఖిల్ ప్రస్తుతం శ్రేయ భూపాల్ అనే అమ్మయితో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం కూడా డిసెంబర్ 9 న జరగనుంది. అఖిల్, నితిన్ మంచి ఫ్రెండ్స్, కాబట్టి తన ఫ్రెండ్ ని హీరోగా పరిచయం చేసాడు నితిన్, ఇప్పుడు అదే ఫ్రెండ్ పెళ్లి విషయంలో హెల్ప్ చేయడానికి రెడీ అయ్యాడు అఖిల్ !! మరి ఇప్పటికే అఖిల్ తన సర్కిల్ లో అమ్మాయిని వెదికే పనిలో పడ్డాడట !!