అఖిల్ మళ్ళీ వస్తున్నాడు..ఈ నెల 19న ఫస్ట్ లుక్..!

Sunday, September 16th, 2018, 05:00:28 PM IST

యువసామ్రాట్ నాగార్జున తనయుడు అఖిల్. తన కొత్త చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలకి ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ముహూర్తం కుదిరింది.ఈ నెల 19న ఆ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నాం అంటూ ఈ రోజు ఒక ఆసక్తికరమైన పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పోస్టర్ని గమనించినట్లయితే అది ఎదో ఒక పాటకి సంబందించినది అని తెలుస్తున్నది.

తన నటనతో ఆకట్టుకున్నా సరే తన ముందు రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ సారి అయినా అఖిల్ విజయం అందుకుంటాడో లేదో చూడాలి.ఈ చిత్రాన్ని ఇది వరకే వరుణ్ తేజ్ తో తొలిప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నాడు.వేచి చూద్దాం అఖిల్ కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో.

  •  
  •  
  •  
  •  

Comments