హలొ అంటూ పాటలకోసం చలో వైజాగ్ ?

Tuesday, December 5th, 2017, 02:25:17 PM IST

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హలో హంగామా మొదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి అప్లాజ్ రావడంతో ఆ క్రేజ్ ని కంటిన్యూ చేయడానికి నాగార్జున పథకం వేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాటలను ఈ నెల 10 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాటల వేడుకను వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ నెల 22 న భారీ స్థాయిలో విడుదల సన్నాహాలు జరుగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments