అఖిల్ హలో .. ఆ సినిమాకు కాపీ అంటున్నారు ?

Saturday, December 2nd, 2017, 10:52:56 AM IST

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతూ నటించిన అఖిల్ సినిమా ప్లాప్ తరువాత రెండేళ్లో గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా హలో. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ ట్రైలర్ లో హీరో 15 ఏళ్లుగా ఓక అమ్మాయికోసం వెతుకుతున్నాడని , ఆమె తన సోల్ మేట్ గా భావించిన హీరో ఆమె దొరికే వరకు వెతుకుతూనే ఉంటాడట. పైగా హీరో అనాధ .. చిన్నప్పుడే ఓ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది .. ఈ కథ వింటుంటే ఎక్కడో విన్నట్టుంది కదా? అవును మీరు అనుకున్నది నిజమే .. ఈ కథను చూస్తుంటే .. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం మనసంతా నువ్వే సినిమాలా ఉందంటూ ట్రైలర్ చూసిన వాళ్లంతా అంటున్నారు. ఆ సినిమాకు అచ్చుగుద్దినట్టు కాపీలా ఉందంటూ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. మరి ఈ విషయంలో నాగ్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments