మొత్తానికి అఖిల్ హలో అంటూ పూర్తీ చేసాడు ?

Sunday, October 22nd, 2017, 10:06:56 AM IST

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చింది. క్రేజీ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. ఎందుకంటే అఖిల్ హీరోగా పరిచయం అవుతూ నటించిన అఖిల్ సినిమా భారీ ప్లాప్ ను అందుకోవడంతో అఖిల్ కు హీరోగా మంచి ఎంట్రీ దక్కలేదు .. దాంతో కొంత గ్యాప్ తరువాత రెండో సినిమా చేస్తున్నాడు. లవ్ , ఫ్యామిలీ యాక్షన్ ఎమోషన్ లతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అఖిల్ చాలా ఆశలే పేట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి విజయాన్ని సాధించాలనే ప్లాన్ తో నాగార్జున గట్టి ప్రయత్నేలే చేస్తున్నాడు.