ఎక్స్‌ఛేంజ్‌: అఖిల్ వ‌ర్సెస్ నాగ‌శౌర్య‌!?

Monday, April 16th, 2018, 09:16:25 PM IST


అటు ఇటు అయితే పొర‌పాటు లేదోయ్‌.. సారీ.. `కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్‌.. ఓడిపోలేదోయ్‌!` అని సాంగేసుకోవాల్సొస్తోంది ఈ స‌న్నివేశం చూస్తుంటే, టాలీవుడ్‌లో ఇద్ద‌రు యంగ్ హీరోలు త‌మ కాబోయే హీరోయిన్ల‌ను అటూ ఇటూ ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నారు. షాపింగ్‌మాల్‌లో కొనుక్కున్న‌ చొక్కా న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ మార్చుకున్న‌ట్టు ఈ ఎక్స్‌ఛేంజి ఆఫ‌ర్ ఏంటి? అంటారా? అయితే కాస్త డీప్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్లాలి.

ప్ర‌స్తుతం అక్కినేని హీరో అఖిల్ మూడ‌వ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సేమ్ టైమ్ నాగ‌శౌర్య సైతం ఓ కొత్త సినిమాకి సీరియ‌స్‌గా క‌థానాయిక‌ను వెతుకుతున్నాడు. ఆ క్ర‌మంలోనే ముందుగా అఖిల్ హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌ని శౌర్య సెల‌క్ట్ చేసుకున్నాడ‌ని టాక్ వినిపించింది. ఆ క్ర‌మంలోనే అఖిల్ రివ‌ర్సులో శౌర్య హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌ను త‌న నాయిక‌గా ఫిక్స్ చేసుకున్నాడ‌ట‌. ఇటీవ‌లే శౌర్య స‌ర‌స‌న ఛ‌లో చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ర‌ష్మిక అంటే అఖిల్ ప‌డి చ‌స్తున్నాడ‌ట‌. అందుకే ద‌ర్శ‌కుడు వెంకీ త‌నే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి ఒప్పిస్తున్నాడ‌ట‌. ఇంత‌వ‌ర‌కూ ర‌ష్మిక ఈ సినిమాకి సంత‌కం చేసింది లేదు. క్లోజ్ సోర్సెస్ చెబుతున్న మాట ప్ర‌కారం.. ర‌ష్మిక డైరీ ఫుల్ బిజీ. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాని సినిమాల‌కు సంత‌కాలు చేసిన ఈ భామ కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌లేని స్థితిలో ఉందిట‌. ఈ డైలెమ్మాలో అఖిల్‌కి ఎస్ చెప్పాలా? నో చెప్పాలా? అని వేచి చూస్తోందిట‌. మ‌రి చివ‌రికి ఓకే అవుతుందా? లేదా? అన్న‌ది కాస్త వేచి చూడాలి.