నాగార్జున బి-డేకి అఖిల్ ఇచ్చే షాక్‌!

Monday, July 30th, 2018, 03:47:53 PM IST

అక్కినేని మిసైల్‌ అఖిల్ న‌టిస్తున్న‌ మూడో సినిమా ప్ర‌స్తుతం వేగంగా తెర‌కెక్కుతోంది. బ్రిట‌న్‌లో 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నారు. తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఇంత‌వ‌ర‌కూ టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. అలానే ఫ‌స్ట్‌లుక్ ఎలా ఉంటుందో చూపించ‌లేదు.

తాజాగా అందుకు ముహూర్తం ఖ‌రారైంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 29న కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు కానుక‌గా అఖిల్ 3 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. అలానే అదే వేదిక‌పై టైటిల్‌ని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్పుడ‌ర్థ‌మైందా? నాగార్జున పుట్టిన‌రోజుకి అఖిల్ ఇవ్వ‌బోయే షాక్ ఏంటో? వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాలు ఇబ్బంది పెట్టాయి. ఈసారైనా అక్కినేని మిసైల్ దూసుకొచ్చి హిట్టు కొడుతుందా లేదా చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments