హీరో నితిన్‌పై కేసు కొట్టివేత

Tuesday, January 9th, 2018, 11:17:05 AM IST

2015 లో వచ్చిన అఖిల్ సినిమా ఎలాంటి పరాజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో నిర్మాత నితిన్ అలాగే ఇతర పంపిణీదారులు కూడా చాలా వరకు నష్టపోయారు. అయితే సినిమా పంపిణి విషయంలో కూడా అప్పట్లో ఒక వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా హక్కులను తనకు ఇస్తాను అంటూ 50 లక్షలు తీసుకొని నిర్మాతలు మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన జి.సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు. నితిన్‌తో ఆయన సోదరి నిఖితారెడ్డి తండ్రి సుధాకర్‌రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. దీంతో గత కొంత కాలంగా మల్కాజిగిరి కోర్టులో నడుస్తున్న ఈ క్రిమినల్‌ కేసుపై ఎట్టకేలకు హై కోర్టు తీర్పును ఇచ్చింది. ఇది చెక్కులకు సంబందించిన కేసు అని క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని చెబుతూ.. కోర్టు కేసును కొట్టి వేసింది.