అఖిల్ – వర్మ.. చెప్పేసిన నాగ్!

Thursday, May 31st, 2018, 01:48:09 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తెరకెక్కించిన ఆఫీసర్ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ పై నాగార్జున చాలా నమ్మకంతో ఉన్నాడు. మళ్లీ సరికొత్త సినిమా చూస్తారు అని అక్కినేని అభిమానులకు ఆఫీవర్ సినిమా కొంచెం కూడా నిరుత్సాహపరచదని నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు సినిమా చాలా గొప్పగా తీసినట్లు ప్రమోషన్స్ లో నాగార్జున తెలిపారు. అయితే వర్మ అఖిల్ తో సినిమా చేస్తాను అని గతంలో చెప్పాడు. ఆ విషయం గురించి ఓ ప్రశ్న ఎదురవ్వగా నాగ్ పాజిటివ్ గా స్పందించారు.

ట్విట్టర్ లో నేను అయితే ఎప్పుడు చెప్పలేదు. ప్రస్తుతం కొన్ని కథల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏమవుతుందో చూడాలి అంటూ నాగార్జున సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేశారు. దీంతో వర్మ దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుందని చాలా మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రస్తుతం అఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసిన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగ్ మరోవైపు నాని తో చేస్తున్న మల్టి స్టారర్ షూటింగ్ లో కూడా బిజీగా పాల్గొంటున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments