ముచ్చటగా మూడు… వస్తున్నాడు అఖిల్

Monday, March 26th, 2018, 10:37:04 PM IST

తెలుగు అభిమానుల హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్‌ మూడో చిత్రం ఈరోజు ఘనంగా లాంఛ్‌ అయ్యింది. హలో చిత్రం ద్వారా హిట్టు కొట్టిన ఈ అక్కినేని అందగాడు హీరోగా, తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందని కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రముఖ సీనియర్‌ హీరో, అఖిల్‌ తండ్రి నాగార్జున అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ బోర్డ్ కొట్టగా.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశాడు.

తాజా హిట్లతో దూసుకుపోతున్న థమన్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందించాబోతున్నాడు. అయితే ఎన్నో గొప్ప హిట్ చిత్రాలను మనకందించిన జార్జ్‌ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర(ఎస్‌వీఎస్‌సీ) బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి మాత్రం సినిమాకి ఏం పేరు పెట్టారన్నది కొంచం సస్పెన్స్ లో పెట్టారు.