మళ్లీ నాగ్ ఇమేజ్ ను వాడేస్తున్న అఖిల్?

Monday, May 28th, 2018, 10:40:00 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో అఖిల్ ముందు వరుసలో ఉన్నాడని చెప్పాలి. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ తరువాత హలో సినిమాతో వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేదు. ఇక నెక్స్ట్ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని తొలి ప్రేమ దర్శకుడితో చేతులు కలిపాడు. వెంకీ అట్లూరి తన మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఒక టైటిల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. మిస్టర్ మజ్ను అనే టైటిల్ ను పరిశీలుస్తున్నారట. అఖిల్ తన తండ్రి టైటిల్స్ ను బాగా వాడుతున్నట్లు అర్ధమవుతోంది. హలో బ్రదర్ టైటిల్ లో హలో తీసుకున్నట్లు ఇప్పుడు మజ్ను ని కూడా కవర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల లాంచ్ అయిన ఈ సినిమా తొలి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేయనున్నారు. వచ్చేనెల రెండవ వారంలో ఆ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఇక అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments