పూరి దర్శకత్వంలో .. అక్కినేని హీరో ?

Friday, February 9th, 2018, 01:22:54 PM IST

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న పూరి జగన్నాద్ తన పరాజయాలకు పులిస్టాప్ పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అయన తనయుడు ఆకాష్ తో మెహబూబా చిత్రాన్ని రూపొందిస్తున్న పూరి తన నెక్స్ట్ సినిమాకోసం అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడట. ప్రస్తుతం పూరి జగన్నాద్ తో సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదని .. అందుకే తన తనయుడితోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కినేని హీరో తో పూరి జగన్నాధ్ సినిమా చేస్తాడని అంటున్నారు? ఇంతకీ ఎవరా అక్కినేని హీరో అంటే .. ఇంకెవరు అక్కినేని చిన్నోడు అఖిల్? అఖిల్ హీరోగా అఖిల్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టినా ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు .. దాంతో చాలా గ్యాప్ తీసుకుని రెండో ప్రయత్నంగా హలో చేసాడు .. అది యావరేజ్ హిట్ గా ఎం మాత్రమే నిలిచింది. అసలు అఖిల్ ని మాస్ హీరోగా నిలబెట్టాలని నాగార్జున ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పూరి తో సినిమా చేయమని చెప్పాడట. నాగార్జునతో పూరి చేసిన సినిమాలతో నాగ్ కు మంచి పేరు వచ్చింది .. అందుకే అఖిల్ తో అయన సినిమా చేయమని చెప్పాడట. హీరోలను పక్కా మాస్ లుక్ లో చూపించే పూరి ఇప్పుడు అఖిల్ కోసం రంగంలోకి దిగడాని అంటున్నారు. సో మెహబూబా షూటింగ్ చివరి దశలో ఉంది … అది పూర్తీ చేయగానే వెంటనే అఖిల్ సినిమా మొదలు పెడతారట !!