మొత్తానికి అఖిల్ సేఫ్ అయినట్టేనా ?

Saturday, June 9th, 2018, 12:51:16 AM IST

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా సినిమాకు ప్లాన్ చేసాడు నాగ్. సంచలన దర్శకుడు వర్మ తో ఈ సినిమా చేయాలనీ అనుకున్నాడు .. కానీ పరిస్థితి మరోలా మారింది. నాగ్ తో వర్మ చేసిన ఆఫీసర్ భారీ పరాజయం పాలవడంతో నాగ్ ఆలోచన మారింది. వర్మకు ఈ మధ్య సరైన సక్సెస్ లేకున్నప్పటికీ వర్మకు ఛాన్స్ ఇచ్చాడు నాగ్. కానీ ఆ అవకాశాన్ని వర్మ సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఇక అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ తరువాత చేసిన హలో కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అఖిల్ కోసం ఓ కమర్షియల్ సినిమాను వర్మతో ప్లాన్ చేసాడు నాగ్ . ఇప్పటికే తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న అఖిల్ మాత్రం ఈ విషయం గురించి ఎక్కడ చెప్పలేదు.