క్రిస్మ‌స్ బ‌రిలో అఖిల్‌

Wednesday, May 23rd, 2018, 11:44:02 PM IST


అక్కినేని చియాన్ అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న మూడో చిత్రానికి `తొలి ప్రేమ` ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా జూన్ 5 నుంచి బ్రిట‌న్‌లో ప్రారంభం కానుంది. బ్రిట‌న్ నేప‌థ్యంలో మెజారిటీ పార్ట్ క‌థాంశం న‌డుస్తుందిట‌. రెండు నెల‌ల పాటు సుదీర్ఘంగా యూకే లోనే ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగ‌ష్టు 14 నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసి త‌దుప‌రి ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌ని భావించినా, అప్ప‌టికి కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొందిట‌.

ఒక‌వేళ చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైన‌ ప‌క్షంలో క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న సాగుతోందిట‌. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `స‌వ్య‌సాచి` చిత్రంలో న‌టిస్తున్న నిధి అగ‌ర్వాల్ అఖిల్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాల త‌ర‌వాత అఖిల్ న‌టిస్తున్న ఈ సినిమా అత‌డి ఫేట్‌ని మారుస్తుంద‌నే భావిస్తున్నారంతా.

  •  
  •  
  •  
  •  

Comments