అఖిలేష్, శివపాల్ ఇద్దరిలో ఎవరు నెగ్గారు….?

Friday, January 20th, 2017, 04:14:04 PM IST

akhilesh-mulayam
నిన్నటివరకు ఉప్పు, నిప్పులా ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ లు మళ్ళీ ఒక్కటైనట్టు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో రగులుకున్న రాజకీయ కుంపటికి మూల కారణమైన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో సమాజ్ వాదీ పార్టీ రెండు ముక్కలైంది. అఖిలేష్ యాదవ్ తన తండ్రి నుండి పార్టీ పగ్గాలు బలవంతంగా లాక్కున్నారు. ఒకానొక సమయంలో ములాయం సింగ్ యాదవ్ అవసరమైతే తన కొడుకుపైనే పోటీ చేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. కానీ ప్రస్తుతం అక్కడ తుఫాన్ వెలిసిన తరువాత ప్రశాంతత నెలకొంది.

సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించిన తొలి విడత 191 మంది అభ్యర్థుల జాబితాలో బాబాయ్ శివపాల్ యాదవ్ పేరు కూడా ఉంది. ములాయం యాదవ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య విభేదాలు సమసిపోయాయని చెప్పడానికే బాబాయ్ కి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ములాయం, అఖిలేష్ లు వేరువేరుగా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ కే చెందుతుందని తీర్పు చెప్పింది. దీంతో ములాయం మళ్ళీ అఖిలేష్ కు దగ్గరవుతున్నట్టు కనిపిస్తుంది.