1.40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఫ్రీ..స్కీము అదిరిపోలా..!

Sunday, January 22nd, 2017, 08:20:50 PM IST

akhilesh-kumar
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వరాల జల్లులు కురిపించాడు.త్వరలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు.ఈ మేనిఫెస్టో లో అఖిలేష్ అనేక వరాల జల్లులు ఓటర్ల పై కురిపించాడు. ‘సమాజ్ వాదీ స్మార్ట్ ఫోన్ యోజన’ పథకం కింద 1.40 కోట్ల స్మార్ట్ ఫోన్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు అఖిలేష్ తెలిపారు.

అలాగే పేద మహిళలకు కుక్కర్లు ఉచితంగా ఇవ్వడం తోపాటు రూ 1000 ఫించను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు కేజీ నెయ్యి ఇవ్వనున్నట్లు కూడా మేనిఫెస్టో లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి 300 స్థానాలలో పైగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.చూద్దాం అఖిలేష్ ఆల్ ఫ్రీ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో..!