అఖిలేష్ కు అపశకునం లా మారిన హై టెక్ బస్సు…!!

Thursday, November 3rd, 2016, 03:03:57 PM IST

akhilesh-bus
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బీఎస్పీ ఉపాధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముచ్చటపడి కోటి రూపాయలు పెట్టి తనకోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బెంజ్ కంపనీ బస్సు రథ యాత్ర ప్రారంభం అయి విజయవంతంగా ఒక్క కిలోమీటరు కూడా ప్రయానించకుండానే తుస్సు మంది. ఇప్పటికే పార్టీ లో రగులుతున్న కుటుంబ వర్గాల విబెధాలతో అసంతృప్తి లో ఉన్న అఖిలేష్ కు బస్సు యాత్ర మరింత అసంతృప్తిని మిగిల్చింది. రథయాత్ర కోసం భారీగా సొమ్ము వెచ్చించి తయారు చేయించుకున్న హైటెక్ బస్సు ఆరంభంలోనే మొరాయించడంతో అఖిలేశ్ అసంతృప్తికి గురయ్యారు. ఇప్పటికే బాబాయి శివపాల్ యాదవ్ తో విభేదాలతో సతమవుతున్న ‘అబ్బాయి’కి హైటెక్ బస్సు అపశకునంలా మారింది. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన ‘క్రాంతి రథం’ ఉపయోగించారు.