హలో మూవీలో నా నెంబర్ వాడారు.. నాగ్ 50 లక్షలు ఇవ్వాలి: జార్ఖండ్ వాసి

Thursday, January 25th, 2018, 09:28:33 AM IST

అక్కినేని హీరో అఖిల్ నటించిన హలో సినిమా పై ఎవరు ఊహించని విధంగా ఓ కేసు నమోదైంది. నిర్మాత నాగార్జున తనకు 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని జార్ఖండ్ కి చెందిన ఓ వ్యక్తి వికాస్ ప్రజాపతి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత నెల డిసెంబర్ లో విడుదలైన హలో సినిమాలో హీరోయిన్ కళ్యాణి వాడిన ఫోన్ నెంబర్ తనదేనంటూ ఇప్పుడు తనకు చాలా మంది ఫోన్ చేసి నువ్వు కళ్యాణివేనా? ఏం చేస్తున్నావ్? ఎక్కడున్నావ్ ? అని పలు రకాల మాటలతో అభిమానులు హింసిస్తున్నారని చెబుతూ..మొదట ఈ నెంబర్ ఎవరిదో అని ఆరా తీయగా అన్నపూర్ణ ప్రొడక్షన్ లో నాగార్జున నిర్మించిన హలో సినిమాలో తన నెంబర్ వాడారని తెలుసుకొని కోర్టుకెక్కినట్లు తెలిపాడు. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. టెలికం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే ఆ నెంబర్ ను సినిమాలో వాడుకున్నామని ఇలా జరుగుతుందని ఊహించలేదని నాగ్ తెలిపారు.