అక్కినేని- ద‌గ్గుబాటి మ‌ల్టీస్టార‌ర్‌?

Tuesday, January 31st, 2017, 03:22:02 PM IST

akkineni-dagubati-family
క‌లిసుంటే క‌ల‌దు సుఖం… క‌మ్మ‌ని సంసారం! అంటూ విక్ట‌రీ వెంక‌టేష్ `క‌లిసుందాంరా` సినిమాలో పాడుకున్నాడు. ఆ పాట‌లోని అర్థంలాగా క‌లిసుందాం.. క‌లిసి మ‌ల్టీస్టార్లు చేసుకుందాం అని అక్కినేని-ద‌గ్గ‌బాటి హీరోలు అనుకుంటే అభిమానుల‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండుగే. ఇదిగో ఇక్క‌డ ఉన్న ఫోటోలో నాగార్జున‌, వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్, రానా ఇంత పెద్ద లైన‌ప్ ఉంది.

వీళ్లంతా క‌లిస్తే పండుగే పండుగ‌. క‌లిసి మ‌ల్టీస్టార్లు చేస్తే ఇంకా పెద్ద పండుగ‌. అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయే సంద‌ర్భం మునుముందు వ‌స్తుంది. నాగార్జున, వెంక‌టేష్ క‌లిసి మ‌ల్టీస్టారర్లు చేసే ఛాన్స్ ఇదివ‌ర‌కే రాక‌పోయినా.. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, రానా, అఖిల్ క‌లిసి మ‌ల్టీస్టారర్లు చేసే వీలుంది. అలాగే వీళ్ల సినిమాల్లో పెద్ద హీరోలిద్ద‌రూ సీనియ‌ర్ల గెట‌ప్పుల్లో క‌నిపించేందుకు ఆస్కారం ఉంది. కాబ‌ట్టి క‌లిసుంటే క‌ల‌దు సుఖం.. అని ఒప్పుకోవాల్సిందే.

(అక్కినేని నాగ‌చైత‌న్య నిశ్చితార్థ వేడుక వేళ ఇలా గ్రూప్‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు)