అక్కినేని హీరో బంతాడేస్తాడ‌ట‌

Tuesday, July 24th, 2018, 09:21:25 PM IST

అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్ ప‌రంగా దూకుడు పెంచిన సంగ‌తి తెలిసిందే. అందాల‌ సమంత త‌న జీవితంలో ప్ర‌వేశించాక అత‌డిలో ఛామ్ మ‌రింత‌గా పెరిగింది. పెళ్లి త‌ర్వాత సినిమాల ప‌రంగా వేగం పెంచాడు. ఇప్ప‌టికిప్పుడు ఒకేసారి రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. అత‌డు న‌టించిన స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాలు దాదాపు చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఇవి రెండూ త‌న‌కు కెరీర్ ప‌రంగా పెద్ద సక్సెస్‌నిస్తాయ‌ని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. చాలాకాలంగా త‌న‌కు మాస్ ఇమేజ్ కావాల‌ని కోరుకుంటున్న చైతూకి ఆశించిన‌ది ద‌క్కుతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

మ‌రోవైపు చైత‌న్య ఇరు సినిమాల నిర్మాణానంత‌ర ప‌నుల్ని వేగంగా పూర్తి చేయాల‌ని సూచించాడ‌ట‌. సేమ్ టైమ్ నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాని లాంచ్ చేశాడు. స‌మంత‌తో క‌లిసి ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా క్రికెట్ నేప‌థ్యంలో కొత్త ఫ్లేవ‌ర్‌లో సాగే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెబుతున్నారు. చైతూ క్రికెట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈ పాత్ర కోసం అత‌డు క్రికెట్ ప్రాక్టీస్‌ని ప్రారంభించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి అక్కినేని హీరో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. ప్ర‌తి సినిమాకి కంటెంట్ ప‌రంగా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఆ మేర‌కు కింగ్ అనుభ‌వం అత‌డికి అక్క‌ర‌కొస్తోంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments