అక్కినేని నాయిక‌ మూడు ముక్క‌లాట‌!

Sunday, May 20th, 2018, 02:10:27 AM IST


టాలీవుడ్‌లో కొత్త త‌రం నాయిక‌ల వెల్లువ అంత‌కంత‌కు పెరుగుతోంది. మ‌ల‌యాళం, క‌న్న‌డంలో ప్ర‌తిభ చూపించి అటుపై టాలీవుడ్‌లో పాగా వేస్తున్న క‌థానాయిక‌ల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో కొత్త పేరు చేరుతోంది. ఈ అమ్మ‌డి పేరు నిధి అగ‌ర్వాల్‌. ఈ భామ‌కు హైద‌రాబాద్ మూలాలు ఉన్నాయి. నిధి హైద‌రాబాద్‌లో జ‌న్మించింది. అటుపై బెంగ‌ళూరులో చ‌దువులు కొన‌సాగించింది. బంట్ క‌మ్యూనిటీకి చెందిన ఈ అంద‌గ‌త్తె అటుపై చ‌దువు పూర్త‌వ్వ‌గానే అందాల పోటీల‌తో ఆక‌ట్టుకుని, నేరుగా ముంబై ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశం అందుకుంది. బాలీవుడ్‌లో టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న `మున్నా మైఖేల్‌` చిత్రంలో అవ‌కాశం అందుకుంది. ఆ సినిమా కోసం 300 మంది క‌థానాయిక‌ల్ని ప‌రిశీలించిన టైగ‌ర్ చివ‌ర‌కు నిధి అందానికి ఫిదా అయిపోయి అవ‌కాశం ఇచ్చాడట‌. అటుపై టాలీవుడ్‌లోనూ ఆరంగేట్రం చేస్తోందిప్పుడు.

అక్కినేని నాగ‌చైత‌న్య స‌ర‌స‌న చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న‌ `స‌వ్య‌సాచి` చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది. చైతూ సోద‌రుడు అఖిల్ న‌టించే 3వ చిత్రంలోనూ ఈ అమ్మ‌డే ఫిక్స‌యింది. లండ‌న్‌లో ఈ నెల 29 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతోంది. మ‌రోవైపు బాలీవుడ్‌లో `టాయ్‌లెట్‌-ఏక్ ప్రేమ్‌క‌థ‌` ఫేం నారాయ‌ణ్ తెర‌కెక్కించ‌నున్న తాజా చిత్రంలోనూ నిధి నాయిక‌గా ఎంపికైంది. వీటికి తోడు అటు బెంగ‌ళూరు ప‌రిశ్ర‌మ‌లోనూ నిధికి అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయిట‌. ఈ సీన్ చూస్తుంటే ఈ భామ చాలా తెలివిగానే ప్లాన్ చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, ముంబై వంటి మెట్రో న‌గ‌రాల‌తో ఈ అమ్మ‌డికి ఉన్న లింకులు కెరీర్ పరంగా ఓ రేంజులో క‌లిసొస్తున్నాయ‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments