స‌క్సెస్‌ క‌థ‌ను లాక్కున్న అక్కినేని కాంపౌండ్‌!

Saturday, October 21st, 2017, 11:31:41 AM IST

అక్కినేని ఫ్యామిలీ హీరోలు న‌టించిన మెస్మ‌రైజింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `మ‌నం`. లెజెండ్ ఏఎన్నార్ న‌టించిన చిట్ట‌చివ‌రి సినిమా ఇది. ఏఎన్నార్‌, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్ .. ఇలా ఆల్మోస్ట్ అక్కినేని వంశ‌వృక్షంలోని హీరోలంతా న‌టించిన చిత్ర‌మిది. అయితే అంత‌టి గ్రేట్ మూవీని ఇచ్చి విక్ర‌మ్‌.కె.కుమార్ అక్కినేని కాంపౌండ్ డైరెక్ట‌ర్‌గా ప‌ర్మినెంట్ అయిపోయాడు. విక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేందుకు కింగ్ నాగార్జున సిద్ధంగా లేరు. ప్ర‌స్తుతం అఖిల్ రెండో సినిమా హ‌లోని విక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్నారు.

అయితే ఇంత‌టి గొప్ప అవ‌కాశం విక్ర‌మ్‌.కెకి ద‌క్కిన మాట అటుంచితే, అస‌లు మ‌నం క‌థ అక్కినేని కాంపౌండ్‌కి సంబంధించిన క‌థ అని తెలిస్తే షాక‌వ్వ‌డం మ‌న‌వంతు అవుతుంది. వాస్త‌వానికి `మ‌నం` క‌థ‌ను వేరే స్టార్ల‌ను ఉద్ధేశించి విక్ర‌మ్‌.కె రాసుకున్నారుట‌. ఏఎన్నార్ న‌టించిన పాత్ర‌లో కె.విశ్వ‌నాథ్‌ను, నాగార్జున పాత్ర‌కు విక్ట‌రీ వెంకటేష్‌ను, నాగ‌చైత‌న్య పాత్ర‌కు సిద్ధార్థ్‌ను ఊహించుకుని విక్ర‌మ్ క‌థ రాసుకున్నారుట‌. ఆ క్ర‌మంలోనే సిద్ధార్థ్ వ‌ద్ద‌కు వెళ్లి క‌లిశాడుట‌. అయితే స్క్రిప్టు పూర్తిగా రెడీ అయ్యేప్ప‌టికి సీన్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఆ క‌థ అక్కినేని కాంపౌండ్‌కి వెళ్లిపోయింది. అక్క‌డ కింగ్ క‌థ విన‌డం .. అక్కినేని ఫ్యామిలీ సినిమాగా మార్చేయ‌డంజ‌రిగింది. ఈ క‌థంతా హీరో సిద్ధార్థ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. అలాంటి అవ‌కాశం పోయినందుకు చాలానే బాధ‌ప‌డ్డాడు. పోతే పోయింది కానీ సిద్ధూ.. ఓ గ్రేట్ ఛాన్స్ అక్కినేని కాంపౌండ్‌కి ద‌క్కింది. మ‌నం లేక‌పోతే అస‌లు అక్కినేని హీరోల స‌న్నివేశం ఎలా ఉండేదో?

  •  
  •  
  •  
  •  

Comments